Medical Jobs: ఓటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీపై అభ్యంతరాలు
ఉమ్మడి జిల్లా డీసీహెచ్‌ఎస్‌లు డాక్టర్ పాల్ రవికుమార్, డాక్టర్ తిప్పేంద్ర నాయక్ పాల్గొని అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కాగా, ఓటీ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కొందరు అభ్యంతరాలు లేవనెత్తారు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో కొందరు విద్యాభ్యాసం చేస్తూనే సేవా అనుభవం (ఎక్స్‌పీరియన్స్) ధ్రువీకరణ పత్రాలు పొందుపరిచినట్లు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పాల్ రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం గందరగోళానికి దారి తీసింది.
చదవండి: Medical Health Department: కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
నకిలీ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్‌కు హాజరైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీహెచ్‌ఎస్ ప్రకటించడంతో పలువురు స్వచ్ఛందంగా వైదొలిగారు. అలాగే ఒకేవొక రేడియోగ్రాఫర్ పోస్టుకు సంబంధించి అభ్యర్థులెవరూ హాజరుకాలేదు. దీంతో ఆ పోస్టు భర్తీని వాయిదా వేశారు.
మొత్తం 56 పోస్టులకు గానూ జనరల్ డ్యూటీ అటెండెంట్ 28, ప్లంబర్లు 5, ఓటీ అసిస్టెంట్లు 8, ల్యాబ్ టెక్నీషియన్లు 2, ఫార్మసిస్టులు 2, పోస్టుమార్టం అసిస్టెంట్లు 3, ఆడియోమెట్రీ 1, ఆఫీస్ సబార్టినేట్ 1, మెడికల్ రికార్డు అసిస్టెంట్ 2 తదితర పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహించి అర్హత సాధించిన వారికి నియామక ఉత్తర్వులు అందజేశారు.
కార్యక్రమంలో ఏఓ ఉదయభాస్కర్, సీనియర్ అసిస్టెంట్ నాగార్జున, జూనియర్ అసిస్టెంట్ చరణ్‌సాయి తదితరులు పాల్గొన్నారు.