Medical Health Department: కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
గుంటూరుమెడికల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం ద్వారా, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈనెల 10న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా శనివారం విడుదల చేశామన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈనెల 30వ తేదీలోపు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా అందజేయాలని వెల్లడించారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.
చదవండి: AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
డిసెంబర్ 13లోగా దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట: జిల్లా మహిళా, శిశు సంక్షేమం, సాధికారిత కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులకు డిసెంబరు 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ పీడీ బి.అరుణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలల సంరక్షణ యూనిట్ (డీపీయు)లో 12 పోస్టులు, శిశు సంరక్షణ కేంద్రంలో 11 పోస్టులు (కేవలం మహిళలకే), పిడుగురాళ్లలోని చిల్డ్రన్స్ హోమ్‌లోని ఎనిమిది పోస్టులు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్ పద్ధతి ప్రకారం భర్తీచేయబడతాయన్నారు. అభ్యర్థులు ఈ ఏడాది జూలై నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లలోపు వారై ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నరసరావుపేటలోని కార్యాలయానికి తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు.
Tags
- District Medical Health Department
- National Health Mission Programme
- Contract Medical Officer Jobs
- Walk-in interviews
- DMHO
- Provisional Merit List
- contract jobs
- medical jobs
- Education News
- andhra pradesh news
- WalkInInterviews
- MedicalOfficerJobs
- UrbanHealthCenters
- JobOpportunity
- NationalHealthMission
- HealthcareRecruitment
- DistrictMedicalDepartment
- Jobs
- latest jobs in 2023
- Sakshi Education Latest News
- part-time jobs