Medical Colleges: 7 మెడికల్ కాలేజీలకు 497 పోస్టులు
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన 497 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ సెప్టెంబర్ 2న ఆమోదం తెలిపింది.
ఏడాది కాలం కోసం వీరిని నియమించ నున్నారు. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచి ర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌లో మెడికల్ కాలేజీలు రానున్న విషయం తెలిసిందే. ఒక్కో మెడికల్ కాలేజీలో 71 పోస్టులను భర్తీ చేస్తారు. అందులో 6 ప్రొఫెసర్లు, 17 అసోసియేట్ ప్రొఫెసర్లు, 31 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 17 నాన్ క్లినికల్ ట్యూటర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Published date : 08 Sep 2021 02:09PM