Mega Job Fair: బాల్కొండలో మెగా జాబ్‌మేళా
సెప్టెంబర్ 6న సాయంత్రం ఆయన వేల్పూర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జాబ్‌మేళాలో 70 కంపెనీలు పాల్గొంటాయని, సుమారు 4 వేల మందిని నియమించుకునే అవకాశం ఉందన్నారు. ఎస్సెస్సీ మొదలుకొని ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, హోటల్ మేనేజ్‌మెంట్, ఫార్మసీ కో ర్సులు, కంప్యూటర్, నర్సింగ్ కోర్సులు చేసిన వారు ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.
చదవండి: SBI Recruitment 2023: ఎస్‌బీఐలో 6160 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
జాబ్‌మేళాలో పాల్గొనే వారికి ఎటువంటి రు సుము లేదని, సోషల్ మీడియాలో విడుదల చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, నమోదు చేసుకుంటే సరిపోతుందన్నారు. ఇప్పటికే సుమా రు 1400 మంది నమోదు చేసుకున్న ట్లు చెప్పారు. సమావేశంలో ఆసరా ఫౌండేషన్ చైర్మన్ శివశంకర్, నాయకులు రేగుల్ల రాము లు, రాకేశ్‌చంద్ర, నాగధర్‌రెడ్డి పాల్గొన్నారు.
చదవండి: Bank Exam Preparation Tips for IBPS PO: 3,049 పోస్ట్‌ల వివరాలు.. పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్..