23, 935 Jobs: మెగా జాబ్ మేళా
ఏప్రిల్ 23, 24న ఆంధ్రా యూనివర్సిటీలో ఈ మేళా జరుగుతుందని, అభ్యర్థుల నుంచి స్పందన అనూహ్యంగా ఉండటం వల్ల అవసరమైతే మూడో రోజు ఏప్రిల్ 25న నిర్వహిస్తామన్నా రు. ఈ స్పెషల్ డ్రైవ్‌కి హాజరయ్యే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉద్యోగం వస్తుందన్నారు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో జాబ్ మేళా ఏర్పాట్లను ఆయన ఏప్రిల్ 22న పరిశీలించారు. అనంతరం పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కళ్యాణి, నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. విశాఖ జాబ్ మేళా ద్వారా దాదాపు 25 వేల కుటుంబాలు.. అంటే లక్ష మంది ముఖాల్లో చిరునవ్వులు చూడబోతున్నామన్నారు. విశాఖ జాబ్ మేళాకు 206 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో ఉన్న 6 జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మూడు జిల్లాలు మొత్తం 9 జిల్లాల నుంచి దాదాపు 77 వేల మంది ఉద్యోగార్ధులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అందులో కనీసం 50 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.
చదవండి:
Education : ఇక్కడ చదివితే ఉద్యోగాలు ఇవ్వం.. ఎందుకంటే..?
TSPSC & APPSC Groups: గ్రూప్స్‌లో విజయానికి జనరల్ సైన్సే కీలకం.. ఇలా చదివితే..