Education : ఇక్కడ చదివితే ఉద్యోగాలు ఇవ్వం.. ఎందుకంటే..?
Sakshi Education
ఉన్నత విద్య కోసం పాకిస్తాన్‌కి వెళితే ఇండియాలో ఉద్యోగాలు, వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందలేరంటూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థలు స్పష్టం చేశాయి.
ఈ మేరకు సంయుక్త పత్రికా ప్రకటన విడుదల చేశాయి. భారతీయులు కానీ ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ కలిగిన వ్యక్తులు ఎటువంటి ఉన్నత విద్య కోసమైనా పాకిస్తాన్ వెళ్లవద్దంటూ సూచించింది.
పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే..
ఒకవేళ ఎవరైనా పాకిస్తాన్‌కి చెందిన యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో కోర్సులను అభ్యసిస్తే వాటిని గుర్తించమని తెలిపింది. ఈ కోర్సులు, సర్టిఫికేట్ల ఆధారంగా ఇండియాలో ఉద్యోగాలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాటకు అనుమతి ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. ఎవరైనా భారతీయ వలస కార్మికులు పాకిస్థాన్ విద్యాసంస్థల్లో చదువుకుంటే.. వారికి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే ఉద్యోగులు, ఇతర అడ్మిషన్‌లు పొందేందుకు అనుమతి ఇస్తామని పేర్కొంది.
Published date : 23 Apr 2022 01:17PM
PDF