Intermediate: పరీక్షలకు స్టడీ మెటీరియల్.. ఉచితంగా పంపిణీ
ప్రాథమిక అభ్యసన కరదీపిక (స్టడీ మెటీరియల్)ను పెద్ద ఎత్తున ముద్రించి ఏప్రిల్ 21న అన్ని జిల్లాలకు సరఫరా మొదలుపెట్టింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ వీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అత్యంత సీనియర్ లెక్చరర్లతో మెటీరియల్ రూపొందించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ప్రతీ చాప్టర్‌లో ముఖ్యమైన ప్రశ్నలన్నీ క్రోడీకరించారని.. కోవిడ్ కాలం లో అభ్యసన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రశ్నల సరళిపై లోతైన అధ్యయనం జరిగిందని వెల్లడించాయి. పరీక్షలు సమీపిస్తుండటంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మార్కులు సాధించేందుకు ఇది వీలు కలి్పస్తుందన్నాయి.
అన్ని గ్రూపులు.. మాధ్యమాల్లో..
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ గ్రూపులన్నింటికీ బేసిక్ స్టడీ మెటీరియల్ ముద్రించారు. అన్ని సబ్జెక్టులు కలిపి ఒకే పుస్తకంగా రూపొందించారు. తెలుగు, హిందీ, ఉర్ధూ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో అందుబాటులోకి తెచ్చారు. ఏప్రిల్ 22న నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు వీటిని అందించే ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డ్ అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా tsbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ మెటీరియల్ సాఫ్ట్‌కాపీలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వేతర కాలేజీల విద్యార్థులు కూడా ఈ మెటీరియల్‌ను పొందవచ్చన్నారు.
చదవండి:
ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్స్
ఇంటర్మీడియెట్ ప్రివియస్ పేపర్స్
After Inter: ఇంటర్‌తోనే.. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు..
ప్రతి విద్యార్థికీ అందిస్తాం..
ప్రతీ విద్యార్ధికి స్టడీ మెటీరియల్ అందేందుకు ఏర్పాట్లు చేశాం. మెటీరియల్ తయారీ, ముద్రణలో రాజీ పడలేదు. విద్యార్థులు ఎక్కువ మార్కులు స్కోర్ చేసేలా నిపుణులతో తయారు చేయించాం. ఈసారి ప్రశ్నల్లో 50% చాయిస్ ఉంటుంది.
– సయ్యద్ ఒమర్ జలీల్, ఇంటర్ విద్య కార్యదర్శి