Mini Job Fair: మినీ ఉద్యోగమేళాలో ఇంత మందికి కొలువులు
కార్యక్రమంలో జిల్లా కౌశల్య అభివృద్ధి అధికారి కె.శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ఈ మినీ ఉద్యోగమేళాలో 10 కంపెనీలు పాల్గొని 71 మందికి ఉద్యోగాలు కల్పించాయన్నారు. 172 మందికి ఉద్యోగాలను రిజర్వులో ఉంచారని, భవిష్యత్తులో వారికి కూడా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఉద్యోగ మేళాలో 172 మంది పురుషులు, 187 మంది మహిళలు కలిపి మొత్తం 357 మంది పాల్గొన్నారన్నారు.
చదవండి: Engineering Jobs: ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాలు.. రూ.4 లక్షల ప్యాకేజీ
ఎంపికై న వారిలో 32 మంది పురుషులు, 39 మంది మహిళలు ఉన్నారన్నారు. మినీ ఉద్యోగ మేళాలో వేమగల్, కోలారు, వైట్‌ఫీల్డ్, నరసాపురం నుంచి ఎల్‌ఐసీ, సూపర్ టెక్ ఇంజినీర్స్, టీవీఎస్ ట్రైనింగ్ ఇండియా, భారత్ ఫైనాన్సియల్స్, నేహా అసోసియేట్స్, పార్కో ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలు పాల్గొన్నాయన్నారు. నిరుద్యోగ యువత వాక్ ఇన్ ఇంటర్వూలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. సహాయక ఉద్యోగాధికారి మునికృష్ణ, శ్వేత, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.