Skip to main content

Engineering Jobs: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగాలు.. రూ.4 లక్షల ప్యాకేజీ

Campus Placement at Deccan Chemicals, Jobs for Chemical Engineering Students, Successful Campus Placement

నూజివీడు: స్థానిక ట్రిపుల్‌ ఐటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌ లభించాయి. ఇటీవల క్యాంపస్‌లో హైదరాబాద్‌కు చెందిన డెక్కన్‌ కెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నిర్వహించిన ప్లేస్‌మెంట్స్‌లో భావన, సుబ్రహ్మణ్యేశ్వరరావు, రోహిణీకుమారి, దుర్గాప్రసాద్‌, పావని, వెంకటేశ్వరరావు ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించారు. వీరిని కంపెనీ ఏడాదికి రూ.4 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను డైరెక్టర్‌ ఆచార్య జీవీఆర్‌ శ్రీనివాసరావు శుక్రవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏవో పీ ప్రదీప్‌కుమార్‌, డీన్‌ అకడమిక్‌ లక్ష్మణరావు, కెమికల్‌ ఇంజినీరింగ్‌ హెచ్‌వోడీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Contract Employees: ఏపీ ‘కాంట్రాక్టు’ ఉద్యోగులకు శుభవార్త

Published date : 21 Oct 2023 03:16PM

Photo Stories