Skip to main content

Job Mela: డీఎల్‌టీసీ శిక్షణా సంస్థ ప్రాంగణంలో జాబ్‌మేళా

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ హాస్పిటల్‌ జంక్షన్‌లో ఉన్న డీఎల్‌టీసీ శిక్షణా సంస్థ ప్రాంగణంలో న‌వంబ‌ర్ 4న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ ఒక ప్రకటనలో తెలిపారు.
Job Mela
డీఎల్‌టీసీ శిక్షణా సంస్థ ప్రాంగణంలో జాబ్‌మేళా

 జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్‌ మేళాకు ఎస్‌బీఐ కార్డ్స్‌, ఎం/ఎస్‌ సుస్వదీప్‌ ఆగ్రో సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఎస్‌బీఐ కార్డ్స్‌లో 30 బ్రాంచ్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్స్‌కు (జీతం రూ.16 వేల నుంచి రూ.25 వేలు వరకు) ఇంటర్మీడియట్‌ విద్యార్హత కలిగి ఉండి 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కల సీ్త్ర, పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. 30 బ్రాంచ్‌ రిలేషన్‌ మేనేజర్‌ పోస్టులకు డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి 18 నుంచి 35 ఏళ్లు సీ్త్ర, పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 20 ఖాళీలున్న టెలీ కాలర్స్‌, బకెండ్స్‌పోర్ట్‌ టీం (జీతం రూ.16వేలు నుంచి రూ.25 వేలు వరకు) ఇంటర్మీడియట్‌/డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి 18 నుంచి 35 ఏళ్ల సీ్త్ర, పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు.

చదవండి: TTD Recruitment 2023: తిరుమల తిరుపతి దేవస్థానంలో 56 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఎం/ఎస్‌ సుస్వదీప్‌ ఆగ్రో సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో 10 ఖాళీలున్న సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌కు (జీతం రూ.14500 నుంచి రూ.16500 వరకు) ఇంటర్మీడియట్‌/డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి 18 నుంచి 35 ఏళ్ల పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 30 డెలివరీ బాయ్స్‌ పోస్టులకు (జీతం రూ.10000 నుంచి రూ.12000) 10వ తరగతి/ఇంటర్మీడియట్‌ విద్యార్హత కల్గి ఉండాలన్నారు. 5 కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు (జీతం రూ.12000) ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి 18 నుండి 35 ఏళ్ల పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. 10 మర్చండైజర్‌ పోస్టులకు (జీతం రూ.10000) పదో తరగతి/ఇంటర్మీడియట్‌ విద్యార్హత కల్గి ఉండి 18 నుంచి 35 ఏళ్ల పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు న‌వంబ‌ర్ 4న ఉదయం 10.30 గంటలకు బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డ్‌తో హాజరుకావాలని సూచించారు.

Published date : 02 Nov 2023 12:57PM

Photo Stories