Skip to main content

Job Fair: రేపు జాబ్‌మేళా

కంచరపాలెం: స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్‌ కెరియర్‌ సర్వీస్‌ సెంటర్‌లో ఈనెల 27న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి సిహెచ్‌.సుబ్బిరెడ్డి(క్లరికల్‌) తెలిపారు.
Job Fair
రేపు జాబ్‌మేళా

ఎంఏఎస్‌ మైరెన్‌ సర్వీస్‌, ప్లిప్‌కార్ట్‌, వరుణ్‌ మోటార్స్‌, ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఆస్పత్రి, ముత్తూట్‌ ఫైనాన్స్‌, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీల్లో 295 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.

పోర్ట్‌ సర్వేయర్స్‌, అసోసియేట్స్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌, జూనియర్‌ నర్స్‌, కెమిస్ట్‌, ట్రైనీ కెమిస్ట్‌, జూనియర్‌ ఆఫీసర్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, ఫార్మాసిస్ట్‌ తదితర ఉద్యోగాలకు టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పీజీ పూర్తిచేసిన 18–45 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఆయా ఉద్యోగాలను బట్టి జీతం నెలకు రూ.13,000 నుంచి రూ.27,000ల వరకు ఉంటుందన్నారు. 

చదవండి:

SSC Constable Notification 2023: 7,547 కానిస్టేబుల్‌ పోస్ట్‌లు.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి... జాబ్ కొట్టండి

1,207 Jobs in SSC: ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి,డి ఎగ్జామినేషన్‌–2023 వివరాలు.. రాత పరీక్ష.. 200 మార్కులు

Published date : 26 Oct 2023 03:02PM

Photo Stories