Jobs: ప్రాంతీయ శిక్షణ మేనేజర్‌కు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
మహబూబ్‌నగర్ న్యూటౌన్: డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో మేనేజర్‌గా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రవినాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
పదవీ విరమణ పొందిన గెజిటెడ్ అధికారులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 62 ఏళ్ల వయస్సు గల బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీలలో ఏదైనా విద్యార్హత కలిగిన వారు అర్హులని, పీజీ, పీహెచ్‌డీలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
చదవండి: Skill Hubs: స్కిల్ హబ్‌లో ఉచిత కోర్సులతోపాటు ఉద్యోగావకాశాలు..
ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు, పథకాలపై అవగాహన, క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చే అనుభవం ఉండాలన్నారు. నెలకు గౌరవ వేతనంగా రూ.30 వేలు చెల్లిస్తామని, అర్హత గలవారు జనవరి 20లోగా దరఖాస్తులు కలెక్టరేట్‌లో అందజేయాలని సూచించారు.
Published date : 09 Jan 2024 08:30AM