Jobs: లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
గద్వాల అర్బన్: గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా నవంబర్ 5న ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్–1, మైక్రోబయాలజీ–1, అప్‌లైడ్ న్యూట్రిషన్–1, శాంతినగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు –1 పోస్టుల భర్తీకి ఈ నెల 8వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.
చదవండి: Faculty posts: ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ రెండు కళాశాలలకు సంబంధించిన డెమో, ఇంటర్వ్యూలు ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. నిబంధనల ప్రకారం సంబంధిత సబ్జెక్టుల్లో జనరల్/ బీసీలకు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులు కలిగి ఉండాలని, నెట్/సెట్/పీహెచ్‌డీ బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వివరించారు.
Published date : 06 Nov 2023 01:24PM