Skip to main content

AP Jobs: సాగరమిత్ర పోస్టులకు ఇంటర్వ్యూలు

నెల్లూరు (పొగతోట): మత్స్యశాఖకు సంబంధించి సాగర మిత్ర పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహించారు.
Interviews for Sagaramitra Posts

న‌వంబ‌ర్ 28న‌ జెడ్పీ సమావేశ మందిరంలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 30 పోస్టులకు 270 మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూలకు 205 మంది హాజరయ్యారు.

చదవండి: Bank Exam Preparation: 8,773 జూనియర్‌ పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ వివరాలు ఇవే..

అధికారులు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మెరిట్‌, రోస్టర్‌ ఆధారంగా పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.

AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ..ఏపీ పశుసంవర్ధక సబార్డినేట్‌ సర్వీసెస్‌లో రెగ్యులర్‌ ప్రాతిపదికన పశు సంవర్ధక సహాయకులు (ఏహెచ్‌ఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో వి«ధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1896
ఉమ్మడి జిల్లాల వారీగా ఖాళీలు: అనంతపురం-473, చిత్తూరు-100, కర్నూలు-252, వైఎస్సార్‌ కడప-210, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు-143, ప్రకాశం-177,గుంటూరు-229,కృష్ణా-120, పశ్చిమ గోదావరి-102, తూర్పు గోదావరి-15, విశాఖపట్నం-28,విజయనగరం-13,శ్రీకాకుళం-34.
అర్హత: పాలిటెక్నిక్‌ కోర్సు (యానిమల్‌ హస్బెండరీ) లేదా ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సు (డెయిరీయింగ్‌ అండ్‌ పౌల్ట్రీ సైన్సెస్‌) లేదా బీఎస్సీ/ఎంఎస్సీ(డెయిరీ సైన్స్‌) లేదా డిప్లొమా(వెటర్నరీ సైన్స్‌/డెయిరీ ప్రాసెసింగ్‌) లేదా బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ) లేదా బీ ఒకేషనల్‌ కోర్సు(డెయిరీయింగ్‌ అండ్‌ యానిమల్‌ హస్బెండరీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీలకు ఐదేళ్లు, పీహెచ్‌/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.22,460 నుంచి రూ.72,810

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, గోపాలమిత్ర /గోపాలమిత్ర సూపర్‌వైజర్‌గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.12.2023.
దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరితేది:10.12.2023
హాల్‌ టిక్కెట్ల జారీ తేది: 27.12.2023.
రాతపరీక్ష తేది: 31.12.2023.

వెబ్‌సైట్‌: https://ahd.aptonline.in/, https://apaha-recruitment.aptonline.in/

Published date : 29 Nov 2023 01:40PM

Photo Stories