Jobs: ఎంవీటీసీలో పలు పోస్టుల భర్తీకి పరీక్షలు
Sakshi Education
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలో ఖాళీగా ఉన్న మున్సీ, హెడ్‌చైన్‌మెన్, అసిస్టెంట్ చైన్‌మెన్, డంప్‌మెన్, ట్రిప్‌మెన్ పోస్టుల భర్తికి ప్రాక్టికల్, రాత పరీక్షలు జనవరి 24న నిర్వహించారు.
అంతర్గత ఉద్యోగులతో వీటిని భర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా జనవరి 24న శ్రీరాంపూర్ ఎంవీటీసీలో వీటికి సంబంధించిన రాత పరీక్షలు, ప్రాక్టీకల్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను ఏరియా ఎస్‌ఓటూజీఎం రఘుకుమార్ పరిశీలించారు.
చదవండి: Agnipath: యువతకు అగ్నిపథ్ మంచి అవకాశం.. ఈ నైపుణ్యం చూపిన వారిని నేరుగా సైన్యంలోకి
పరీక్షలు పూర్తి పారదర్శంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. డీజీఎం(పర్సనల్) అరవిందరావు, డీజీఎం(ఐఈడీ) చిరంజీవులు, ఏరియా సర్వే అధికారి వెంకటేశం, డీవైపీఎం రాజేశ్వర్‌రావు, సీనియర్ అసిస్టెంట్ అరుంధతి పాల్గొన్నారు.
Published date : 25 Jan 2024 07:20PM