Skip to main content

Agnipath: యువతకు అగ్నిపథ్‌ మంచి అవకాశం.. ఈ నైపుణ్యం చూపిన వారిని నేరుగా సైన్యంలోకి

సిద్దిపేటజోన్‌: యువతకు భారత ప్రభుత్వం అగ్నిపథ్‌ ద్వారా మంచి అవకాశం కల్పిస్తుందని బోయిన్‌పల్లి ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ అధికారి రాజేశ్‌ సూచించారు.
Officer Rajesh encourages South Indian youth to join the army   Agnipath   District Youth Department organizes awareness event on Agnipath

జ‌నవ‌రి 23న‌ స్థానిక ప్రతిభ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులకు అగ్నిపథ్‌ గురించి జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా ఉత్తర భారతదేశంలో యువత అత్యధికంగా సైన్యం లో చేరడానికి ఆసక్తి చూపుతుంటారని, ఇప్పుడిప్పుడే మన దక్షిణ భారతదేశంలో దీనిపై అవగాహన వస్తుందని అన్నారు. యువకులు మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చదవండి: Indian Air Force Recruitment 2024: భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు పోస్టులు.. ఎవరు అర్హులంటే..

రాత, దేహ దారుఢ్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేసి, నాలుగు సంవత్సరాల సమయంలో మంచి నైపుణ్యం చూపిన వారిని నేరుగా సైన్యం లోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి నాగేందర్‌, ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ చీఫ్‌ ఆనంద్‌ గోస్వామి, కళాశాల ప్రిన్సిపాల్‌ సూర్య ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Published date : 24 Jan 2024 03:25PM

Photo Stories