Skip to main content

Layoffs 2023: వందలాది మందిని తొలగించనున్న మరో కంపెనీ..

కొత్త సంవత్సరంపై కోటి ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు, ఉద్యోగార్థులకు కంపెనీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి.
company that will Layoffs hundreds of people

 ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం సుమారు వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరో అంతర్జాతీయ కంపెనీ వందలాది మందిని తొలగించనున్నట్లు తెలిపింది.

గ్లోబల్ స్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైక్.. వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా వందలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను వెల్లడించింది. ‘ది గార్డియన్’ నివేదికల ప్రకారం..  లేఆఫ్‌ల అమలు, కొన్ని సేవలలో ఆటోమేషన్‌ను పెంచడం ద్వారా 2 బిలియన్‌ డాలర్లు (రూ.16 వేల కోట్లకుపైగా ) ఆదా చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

చదవండి: TCS, Infosys: వ‌ర్క్ ఫ్రం హోంకు బైబై.. ఆఫీస్‌కు రాని వారిని తొల‌గించాల‌ని నిర్ణ‌యం... 10 ల‌క్ష‌ల మందిపై ప్ర‌భావం..!

గత సంవత్సరంలో అమ్మకాలలో తిరోగమనాన్ని ఎదుర్కొన్న నైక్, సంస్థాగత క్రమబద్ధీకరణ అవసరానికి అనుగుణంగా ఈ తొలగింపులు చేపడుతున్నట్లు వెల్లడించింది. తొలగిస్తున్న ఉద్యోగులకు చెల్లించే సీవరెన్స్‌‌ ప్యాకేజీల కోసం 450 మిలియన్‌ డాలర్లు ( సుమారు రూ.3,742 కోట్లు)ను కేటాయించునుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో 700 మంది ఉద్యోగుల తొలగింపు తర్వాత నైక్‌ చేపడుతున్న రెండో లేఆఫ్‌ ఇది.

Published date : 26 Dec 2023 02:45PM

Photo Stories