Narendra Modi: హెచ్‌సీయూకు ‘5జీ యూజ్ కేస్ ల్యాబ్’ కేటాయింపు
Sakshi Education
రాయదుర్గం: దేశవ్యాప్తంగా ఉన్న 100 విద్యాసంస్థలకు ‘5జీ యూజ్ కేస్ ల్యాబ్’లను అక్టోబర్ 27న ఆవిష్కరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ఇండియా మొబైల్ కాంగ్రెస్–2023 7వ ఎడిషన్‌లో దీన్ని ఆవిష్కరించారు. ఈ ల్యాబ్‌ను గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి కూడా కేటాయించడం విశేషం.
చదవండి: Enquiry Committee: విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ కమిటీ..కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
తెలంగాణ నుంచి ఈ అరుదైన అవకాశం పొందిన మూడు సంస్థలలో హెచ్‌సీయూ ఒకటి కావడం మరో విశేషం. ఈ ల్యాబ్‌లు ‘100–5జీ ల్యాబ్స్ ఇనిషియేటివ్’ కింద అభివృద్ధి చేస్తారు. ఇందులో భాగంగా మొదట సుమారు రూ.50 లక్షల విలువైన పరికరాలను అందుకోవచ్చని భావిస్తున్నారు. దేశంలో 6జీ–రెడీ అకడమిక్, స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను నిర్మించడానికి ఈ చొరవ కీలకమైన దశగా చెప్పవచ్చు.
Published date : 28 Oct 2023 12:49PM