World Mental Health Day: ప్రతిరోజు ఇన్ని గంటలు నిద్రపోవాలి
Sakshi Education
ఆరోగ్యంగా ఉండడం అంటే కేవలం శారీరకంగానే కాదు. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.
ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవం.. ప్రతిరోజు ఇన్ని గంటలు నిద్రపోవాలి
మానసిక బలమే మహాభాగ్యం. నేటి బిజీ బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య మానసిక ఒత్తిడి. ఉద్యోగమైన కుటుంబ సమస్యలైన చదువు విషయంలోనైనా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలు మానసిక సమస్యతో బాధపడుతున్నారు.
ఈ సందర్బంగా డాక్టర్ కాకర్ల సుబ్బా రావు సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మానేజ్మెంట్ ఆస్కీ పీజీడిహెచ్ఎం విద్యా ర్థులతో డాక్టర్ ఆశిష్ చవుహన్ గారు (MBBS, MD Internal Medicine) అపోలో హాస్పిటల్ (సీనియర్ కన్సల్టెంట్ ), డాక్టర్ సుభోద్ గారి సమక్షంలో, మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలని మాట్లాడారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు 8 గంటలు నిద్రపోవాలని, దీనితో మానసిక, శారీరక సమస్యలను ఎలా అధిగామించవచ్చని డాక్టర్ ఆశిష్ చవుహన్ గారు తెలియజేసారు.