Skip to main content

MOU: ‘అస్కీ’.. కేయూ మధ్య అవగాహన ఒప్పందం

పంజగుట్ట (హైదరాబాద్‌): విద్య, పరిశోధన సంబంధిత అంశాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు హైదరాబాద్‌లోని Administrative Staff College of India (ASCI), వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందం కుదిరింది.
ASCI and Kakatiya University
‘అస్కీ’.. కేయూ మధ్య అవగాహన ఒప్పందం

ఈ మేరకు నవంబర్‌ 24న ఖైరతాబాద్‌లోని అస్కీలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని అస్కీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ నిర్మల్యా బాగ్చి, కాకతీయ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి.శ్రీనివాసరావు తెలిపారు.

చదవండి: NSS Award: కాకతీయ వర్సిటీకి ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డు.. ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

మొదట సైబర్‌ సెక్యూరిటీ, ట్రైబల్‌ వెల్ఫేర్, జోగినులు, ట్రాఫికింగ్‌ బారిన పడిన మహిళలకు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడంపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. విద్యాసంబంధ అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నారు. 

చదవండి: World Mental Health Day: ప్రతిరోజు ఇన్ని గంటలు నిద్రపోవాలి

Published date : 25 Nov 2022 03:50PM

Photo Stories