Skip to main content

World Mental Health Day: అక్టోబర్ 10వ తేదీ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జ‌రుపుకుంటారు.
World Mental Health Day 2024 Theme, History and Significance

ఈ దినోత్స‌వం మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, విద్యను ప్రోత్సహించడం, అపోహలను తొలగించడం కోసం అంకితం చేయబడింది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో చర్చను ప్రారంభిస్తుంది, ఆరోగ్య విధానాలను ప్రోత్సహిస్తుంది.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని 1992లో డిప్యూటీ సెక్రటరీ జనరల్ రిచర్డ్ హంటర్ ప్రారంభించారు. 1994 నుంచి ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట థీమ్‌ను అందించడం ఆనవాయితీగా మారింది. డబ్ల్యూహెచ్ఓ ఈ కార్యక్రమాన్ని పౌర సమాజ సంస్థలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖలతో కలసి అనేక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మానసిక ఆరోగ్యానికి సంబంధించి అవగాహనను పెంచడానికి కృషి చేస్తోంది.

ఈ సంవత్సరం థీమ్ ఇదే.. "మెంటల్ హెల్త్ ఎట్ వర్క్(Mental Health At Work)". ఈ ఏడాది ప్రపంచ మానసిక ఆరోగ్య ఫెడరేషన్ (WFMH) 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా.. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా తీసుకుని, ఆరోగ్యకరమైన పని-జీవన సమతుల్యతను సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. 

World Post Day 2024: అక్టోబర్ 9వ తేదీ ప్రపంచ తపాలా దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

ఈ దినోత్సవం మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, మానసిక శ్రేయస్సుపై బహిరంగ చర్చలను ప్రోత్సహించడం, సంరక్షణకు మద్దతు ఇవ్వడం కోసం రూపొందించబడింది.

Published date : 11 Oct 2024 11:28AM

Photo Stories