Skip to main content

ACP Mohan: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పైకొచ్చాం

జైపూర్‌: చదువుని మించిన ఆస్తి మరేదీ లేదని తా ము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పైకొచ్చామ ని జైపూర్‌ ఏసీపీ మోహన్‌ తెలిపారు.
We studied in government schools
మాట్లాడుతున్న ఏసీపీ మోహన్‌

 జైపూర్‌ మండ ల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ విద్యాలయంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్‌ నేరా లు, ట్రాఫిక్‌రూల్స్‌, షీటీం, మహిళల భద్రత చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏసీపీ మోహన్‌, సీఐ రమేశ్‌, ఎస్సై ఉపేందర్‌రావు తమ విద్యాభ్యాసం, ఉద్యోగం సా ధించిన తీరు, తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చేందుకు చేయాల్సిన కృషిని వివరించారు.

చదువు ను కష్టంగా కాకుండా ఇష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు. లక్ష్యాన్ని ఏర్పర్చుకుని దానిని సాధించేందుకు నిరంతరం కష్టపడాలని సూచించారు. ఇటీవల సైబర్‌ నేరాలు పెరిగా యని లాటరీ పేరుతో ఫోన్‌కు మెసేజ్‌లు పంపి డ బ్బులు ఆశ చూసి అకౌంట్లో డబ్బులు కాజేస్తున్నార ని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులకు జాగ్రత్తలు చెప్పాలన్నారు.

చదవండి: IAS Success Story: జ‌స్ట్ పాస్ మార్కుల‌తో ప‌ది పాస‌య్యా... క‌ట్ చేస్తే ఇప్పుడు క‌లెక్ట‌ర్‌గా సేవ‌లందిస్తున్నా.. నా స‌క్సెస్ జ‌ర్నీ ఇదే

ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన పెంచుకోవడంతోపాటు కుటుంబ సభ్యుల భద్రతపై తల్లిదండ్రులకు సూచనలు చేయాలన్నారు. అనంత రం విద్యార్థినులు పోలీస్‌ అధికారులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీరాంపూర్‌ సీఐ రమేశ్‌, ఎస్సై ఉపేందర్‌రావు, కస్తూరిబాగాంధీ విద్యాలయ ప్రత్యేక అధికారి ఫణిబాల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చదవండి: Civils Success Story: ఫ‌స్ట్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్‌లో ఫెయిల్‌... సెకండ్‌ అటెంప్ట్‌లో రెండో ర్యాంకు సాధించానిలా...

Published date : 28 Aug 2023 03:26PM

Photo Stories