యూజీ, పీజీ కోర్సుల్లో వీఐటీ మెరిట్ స్కాలర్‌షిప్స్
Sakshi Education
2022–23 విద్యా సంవత్సరానికి గాను BBA, B.Com, Law, BSC, BAతో పాటు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చదివేవారికి జీవీ మెరిట్ స్కాలర్‌షిప్, రాజేశ్వరి అమ్మాల్ మెరిట్ స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) వ్యవస్థాపకుడు, చాన్స్‌లర్ విశ్వనాథన్ ప్రకటించారు.
దేశవ్యాప్తంగా ఇంటర్ టాపర్లకు జీవీ మెరిట్ స్కాలర్‌షిప్ ఇస్తామని వైస్ చాన్స్‌లర్ ఎస్వీ కోటరెడ్డి తెలిపారు. కాగా, రాజేశ్వరి అమ్మాల్ మెరిట్ స్కాలర్‌షిప్‌ను అన్ని రాష్ట్రాల్లోని జిల్లా టాపర్లకు అందజేస్తామన్నారు. దీంతో కాలేజీ ఫీజులో 50 శాతం స్కాలర్‌షిప్ పొందుతారని అదే జిల్లా టాపర్ అమ్మాయి అయితే మరో 25 శాతం అదనంగా అంటే 75 శాతం స్కాలర్‌షిప్ లభిస్తుందని వెల్లడించారు. వీఐటీ రిజిస్ట్రార్ జగదీశ్‌చంద్ర ముదుగంటి మాట్లాడుతూ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోడానికి ఆఖరు తేదీ జూలై 31 అని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు తమ వెబ్‌సైట్ www.vitap.ac.in లేదా ఈ–మెయిల్ admission@vitap.ac.in లేదా ఫోన్ నెంబర్ 7901091283లో సంప్రదించవచ్చని సూచించారు.
చదవండి:
Published date : 16 Jul 2022 01:21PM