Skip to main content

మహిళా విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ గా వారిజా రాణి

సుల్తాన్ బజార్: ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో పనిచేస్తున్న డాక్టర్ వారిజా రాణి మహిళా తెలంగాణ విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ గా మార్చి 17న‌ బాధ్యతలు చేపట్టారు.
Varija Rani as Principal of TS Womens University College
మహిళా విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ గా వారిజా రాణి

ఈ మేరకు విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ విజ్ఞులత ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మపురికి చెందిన డాక్టర్ వారిజా రాణి ఉస్మానియా విశ్వ విద్యాలయం సెంటర్ ఉమెన్స్ స్టడీస్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్న లిజంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పొందారు. మహిళా కళాశాల విద్యార్థుల వికాసమే ధ్యేయంగా పనిచేస్తానని ఆమె అన్నారు.

చదవండి:

తెలంగాణ మహిళా వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా విజ్జులత

ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అధికారిగా డాక్టర్ సుజాత

Published date : 18 Mar 2023 01:56PM

Photo Stories