ఇంటర్ పరీక్షలు రద్దు.. ఎందుకో తేలుసా..
Sakshi Education
పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ప్రశ్నా పత్రం లీక్ కావడంతో మార్చి 30న జరగవలసి ఉన్న ఉత్తర్ ప్రదేశ్ సెకండరీ స్కూలు బోర్డుకు చెందిన 12వ తరగతి ఇంగ్లీష్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను రూ.500కు మార్కెట్‌లో అమ్ముతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో యూపీ ఇంటర్ బోర్డు స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంగ్లీష్ పశ్నాపత్రాలు లీక్ అయిన ఈ సిరీస్‌కు సంబంధించిన 24 జిల్లాల్లో మార్చి 30న మధ్యాహ్నం జరుగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను రద్దు చేసింది. మిగతా 51 జిల్లాల్లో ఈ పరీక్షను యథావిధిగా నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారి తెలిపారు. ప్రశ్నా పత్రం లీక్‌కు బాధ్యులైన వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేయవలసిందిగా ఆయన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆదేశించారు.
Published date : 31 Mar 2022 03:56PM