KIA: వర్సిటీకి ఉచితంగా రెండు ఎలక్ట్రికల్ కార్లు
వర్సిటీ ప్రధాన ద్వారం నుంచి సుదూరంగా ఉన్న వైఎస్సార్ పరీక్షల భవనానికి విద్యార్థులు ఈ కార్లను వినియోగించుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. ఎలక్ట్రికల్ కార్లు కేవలం సర్టిఫికెట్లకు వచ్చే విద్యార్థులు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. వీటిని వర్సిటీ వీసీ డాక్టర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి నవంబర్ 6న ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య, ప్రిన్సిపాల్ ఎ.కృష్ణకుమారి, ప్రొఫెసర్లు పి.మురళీకృష్ణ, వి.రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
చదవండి: School Holidays: గురునానక్ జయంతి సందర్బంగా పాఠశాలలకు సెలవు.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ఎస్కేయూకు చేరిన కియా కార్లు
కియా కంపెనీ ఉచితంగా అందించిన రెండు కార్లు నవంబర్ 6న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు చేరాయి. వీటిని వర్సిటీ వీసీ డాక్టర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించేందుకు వీలుగా కియా యాజమాన్యం రెండు కార్లను ఉచితంగా అందజేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య, ప్రిన్సిపాల్ ఎ.కృష్ణకుమారి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.రామచంద్ర పాల్గొన్నారు.