Skip to main content

Bank Officer Posts : నెలకు రూ.50 వేలకు పైగా వేతనంతో యూబీఐలో 1500 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ పోస్టులు

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ).. గత కొంత కాలంగా భారీగా నియామకాలు చేపడుతోంది. తాజాగా 1500 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Local bank officer posts at rbi with 50 thousand salary  Union Bank of India recruitment announcement for Local Bank Officer positions Notification for 1500 Local Bank Officer vacancies at Union Bank of India  Job openings for Local Bank Officers at Union Bank of India

ఈ ఉద్యోగాలకు ఎంపికైతే జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ సర్వీస్‌ (జేఎంజీఎస్‌)–1 హోదాతోపాటు ఆకర్షణీయ వేతనం అందుకోవచ్చు! ఈ నేపథ్యంలో.. యూబీఐ విడుదల చేసిన లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ పోస్టుల వివరాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌ తదితర సమాచారం..

మొత్తం 1,500 పోస్ట్‌లు

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా భర్తీ చేయనున్న పోస్ట్‌ల సంఖ్యను వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 200 పోస్ట్‌ లు, తెలంగాణలో 200 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే వారికి తప్పనిసరిగా తెలుగు భాషలో నైపుణ్యం ఉండాలని స్పష్టం చేశారు.

Women and Child Welfare : మహిళా, శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

అర్హతలు

n    నవంబర్‌ 13, 2024 నాటికి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. n వయసు: అక్టోబర్‌ 1, 2024 నాటికి 20–30 ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్‌– క్రీమీ లేయర్‌) వర్గాలకు మూడేళ్లు చొప్పున మినహాయింపు కల్పిస్తారు.

నెలకు రూ.50 వేలకుపైగా వేతనం

యూబీఐ లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్లుగా ఎంపికైన వారికి జేఎంజీఎస్‌–1 హోదా లభిస్తుంది. రూ.48,480–రూ.85,920 వేతన శ్రేణిలో ప్రారంభ వేతనం అందుతుంది. నెలకు నికర వేతనం రూ.52 వేల వరకు చేతికందుతుంది. జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ సర్వీస్‌(జేఎంజీఎస్‌)–1 హోదాలో నియమితులైన వారు.. భవిష్యత్తులో ఎంఎంజీఎస్‌–2, 3, ఎస్‌ఎంజీఎస్‌–4 హోదా వరకు పదోన్నతి పొందే అవకాశం ఉంది. జోనల్‌ మేనేజర్‌ స్థాయికి చేరుకోవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

రెండు దశల ఎంపిక ప్రక్రియ

యూబీఐ లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్ల నియామక ప్రక్రియను రెండు దశల్లో నిర్వహిస్తారు. తొలిదశలో రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో చూపిన ప్ర­తిభ ఆధారంగా మలి దశలో పర్సనల్‌ ఇంటర్వ్యూ­కు ఆహ్వానిస్తారు. ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పు­న (1:3 నిష్పత్తి) ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

225 మార్కులకు రాత పరీక్ష

n    లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్ల నియామక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను అయిదు విభాగాల్లో 225 మార్కులకు నిర్వహిస్తారు. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ (45 ప్రశ్నలు–60 మార్కులు), జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ (40 ప్రశ్నలు–40 మార్కులు), డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌(35 ప్రశ్నలు–60 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (35 ప్రశ్నలు–40 మా­ర్కులు) నుంచి ప్రశ్నలు అడుగుతారు.

Follow our Instagram Page (Click Here)

మొత్తం నాలుగు విభాగాల్లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. వీటికి అదనంగా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌ ఉంటాయి. మొత్తం 25 మార్కులకు ఈ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇలా ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ కలిపి మొత్తం 225 మార్కులకు తొలి దశ రాత పరీక్ష జరుగుతుంది. 

లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌

తొలిదశ రాత పరీక్ష తర్వాత.. లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ కూడా నిర్వహిస్తారు. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించి నిర్దేశిత భాషలో.. లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. పదో తరగతి, లేదా 12వ తరగతిలో సంబంధిత రాష్ట్రానికి నిర్దేశించిన భాషను ఒక సబ్జెక్ట్‌గా చదివిన వారికి లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నుంచి మినహాయింపు ఇస్తారు. 

Apprentice Training : ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటీస్ శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులు

పర్సనల్‌ ఇంటర్వ్యూ

రాత పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా మలిదశలో పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో అభ్యర్థులకు బ్యాంకింగ్‌ రంగంపై ఉన్న అవగాహన, ఆసక్తి, వ్యక్తిగత నేపథ్యం, భవిష్యత్తు లక్ష్యాలు తదితర అంశాలను పరిశీలిస్తారు.

వెయిటేజీ విధానం

రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ప్రక్రియలు ముగిసిన తర్వాత.. తుది జాబితా రూపొందించే క్రమంలో వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కులకు 80 శాతం వెయిటేజీ, పర్సనల్‌ ఇంటర్వ్యూలో పొందిన మార్కులకు 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. ఈ మేరకు మొత్తం మార్కులను క్రోడీకరించి తుది జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో చోటు సాధించిన వారికి లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్లుగా నియామకం ఖరారు చేస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

ప్రొబేషన్, సర్వీస్‌ బాండ్‌

లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్లుగా నియామకం పొందిన వారికి తొలుత రెండేళ్ల ప్రొబేషన్‌ పిరియడ్‌ ఉంటుంది. ఈ సమయంలో పనితీరు సంతృప్తిగా ఉంటే పర్మనెంట్‌ కొలువు ఖరారు చేస్తారు. అదే విధంగా నియామకం ఖరారు చేసుకున్న వారు బ్యాంకులో కనీసం మూడేళ్లపాటు విధులు నిర్వర్తిస్తామని హామీ ఇస్తూ.. రూ.2 లక్షల విలువైన సర్వీస్‌ ఇండెమ్నిటీ బాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

ముఖ్య సమాచారం

➤    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
➤    ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, నవంబర్‌ 13
➤    ఆన్‌లైన్‌ రాత పరీక్ష: 2025 జనవరి మొదటి వారంలో నిర్వహించే అవకాశం.
    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.unionbankofindia.co.in/english/aboutuscareers.aspx.
➤    ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https:// ibpsonline.ibps.in/ubilbooct24

Join our Telegram Channel (Click Here)

రాత పరీక్షలో రాణించేలా

రీజనింగ్, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌

ఇందులో సిరీస్, అనాలజీ, కోడింగ్‌–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి. కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి కంప్యూటర్‌ ఆపరేషన్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ స్ట్రక్చర్, ఇంటర్నెట్‌ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్‌ షాట్‌ కట్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ సంబంధిత అంశాలు (సీపీయూ, మానిటర్, హార్డ్‌ డిస్క్‌ తదితర) గురించి తెలుసుకోవాలి. అదే విధంగా కంప్యూటర్‌ పదజాలం, బ్యాంకింగ్‌ రంగంలో వినియోగించే సాఫ్ట్‌వేర్‌ల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.

జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌

    ఆర్థిక, వాణిజ్య, వ్యాపార పరిణామాలు,విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో కరెంట్‌ అఫైర్స్, స్టాక్‌ జనరల్‌ నాలెడ్జ్‌ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల (ఎకానమీ,ప్రభుత్వ పథకాలు)కు ప్రాధాన్యం ఇ­వ్వాలి. అంతేకాకుండా ఎకానమీకి సంబంధించి జీడీపీ మూల భావనలు,సమ్మిళిత వృద్ధి,మైక్రో, మ్యాక్రో ఎకనామిక్స్‌ భావనలు తెలుసుకోవాలి. 
Medical Seats: కన్వినర్‌ కోటాలో 3.36 లక్షల ర్యాంకర్‌కు సీటు.. మేనేజ్‌మెంట్‌ కోటాలో ఇన్ని లక్షల ర్యాంకుకు సీటు..
    బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో తాజా పరిణామాలు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. బ్యాంకింగ్‌ రంగంలోని అబ్రివేషన్లు,పదజాలం,విధు­లు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానా­లు, కోర్‌ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్‌ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి. 

డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌

డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌లో రాణించేందుకు కాలిక్యులేషన్‌ స్కిల్స్‌ను పెంచుకోవాలి. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్‌ డేటా, లైన్‌ గ్రాఫ్, బార్‌ గ్రాఫ్‌ తదితర గ్రాఫ్‌ ఆధారిత డేటాలలోని సమాధానాన్ని క్రోడీకరించే విధంగా సాధన చేయాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

ఈ విభాగంలో రాణించాలంటే..ఇంగ్లిష్‌లో బేసి­క్‌ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్,జంబుల్డ్‌ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

AP TET Results 2024 Released: ఏపీ టెట్‌ ఫలితాలు.. ఈ లింక్‌ క్లిక్‌ చేసి రిజల్ట్స్‌ తెలుసుకోండి

లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌

రాత పరీక్షలోనే ఉండే లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌ల కోసం బిజినెస్, పర్సనల్, అఫిషియల్‌ లెటర్స్‌ నమూనాలను ప్రాక్టీస్‌ చేయాలి. అదే విధంగా ఎస్సే రైటింగ్‌ కోసం సమకాలీన అంశాలకు సంబంధించి దిన పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్స్, విశ్లేషణలను చదివి.. వాటిని సొంతంగా రాసుకునే నైపుణ్యం అలవర్చుకోవాలి.
 

Published date : 04 Nov 2024 12:59PM

Photo Stories