Skip to main content

TSWREIS: ఎంబీబీఎస్‌ ప్రవేశాలలో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో భాగంగా నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీల విద్యార్థులు సత్తా చాటారు.
TSWREIS
ఎంబీబీఎస్‌ ప్రవేశాలలో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

మొత్తం 135 మంది విద్యార్థులు తొలివిడత కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించారు. ఇందులో సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థల సొసైటీకి చెందిన 94 మంది విద్యార్థులు ఉండగా...41మంది విద్యార్థులు టీఎస్‌డబ్ల్యూఆర్‌ ఈఐఎస్‌ కు చెందిన వారున్నారు. గురుకులాలకు విద్యార్థులు సీట్లు సాధించడంపట్ల రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గిరిజన సంక్షేమ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లు హర్షం వ్యక్తం చేశారు.

చదవండి: NEET 2022: సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

రెండో విడత కౌన్సెలింగ్‌లో గురుకులాల నుంచి మరింతమంది విద్యార్థులు సీట్లు సాధించాలని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఎంబీబీఎస్‌ సీట్లు పొందిన ప్రతి విద్యార్థికి ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌ ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం సీట్లు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు దినసరి కూలీలుగా, ఇంట్లో పనిమనిషులుగా, భవన నిర్మాణ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా, పని చేస్తున్నవారేనని, పేద కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు సాధించిన అద్భుత విజయమిదని మంత్రులు పేర్కొన్నారు. 

చదవండి: Admissions: ఈ విద్యా సంస్థల్లో సీట్లు ఖాళీ లేవంటూ బోర్డులు

Published date : 04 Nov 2022 03:50PM

Photo Stories