NEET 2022: సత్తా చాటిన గురుకుల విద్యార్థులు
సెప్టెంబర్ 8న ప్రకటించిన NEET 2022 ఫలితాల్లో ప్రతియేటి తరహాలోనే అత్యుత్తమ ప్రతిభ చాటుతూ ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా మార్కులు సాధించారు. విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్‌రోస్, ఆర్‌సీఓ శారద ఉన్నతాధికారులు అభినందించారు. గురుకులంలోనే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిగా మారెళ్ళ స్వాగత్ 565 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. అదేవిధంగా పి రాజేంద్ర 479 మార్కులు, జి విశనాగేపునీత్ 474 మార్కులు, బి భానుప్రకాశ్ 444, పి వెంకటసాయి 438, వి పృధ్విరాజ్ 435, టి రంజిత్ 403 మార్కులతో టాపర్లుగా నిలిచారు. 43 మంది విద్యార్థుల లో పది మంది విద్యార్థులు 400 మార్కులకు పైగా సాధించి ప్రభుత్వ సీట్లను ఆశిస్తున్నారు.
చదవండి:
NEET 2022: ఇంత ర్యాంకు వచ్చినా రాష్ట్రంలో సీటు.. నీట్‌పై నిపుణుల విశ్లేషణ..
NEET Cut Off 2022 : ఈ సారి నీట్ యూజీ-2022 కటాఫ్ మార్కులు ఇంతేనా..?