Nursing College: ఆర్టీసీకి సొంతంగా నర్సింగ్ కళాశాల
ఈ కళాశాలకు ప్రభుత్వం 50 సీట్లను కేటాయించింది. ఇందులో 30 సీట్లను కన్వీనర్ కోటాగా ఉంచి, ఒక్కో సీటుకు రూ.27 వేల ఫీజు నిర్ధారించింది. ఇక మేనేజ్‌మెంట్ కోటాగా 17 సీట్లను కేటాయించి రూ.87 వేలు చొప్పున ఫీజును నిర్ధారించింది. అడ్మిషన్ రుసుముగా రూ.10 వేలు, ఇతరాలకు రూ.3 వేలు కలిపి ఈ కోటా కింద ఒక్కో విద్యార్థికి రూ.లక్ష చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ సిబ్బంది కోటాగా 3 సీట్లను రిజర్వ్ చేశారు. సిబ్బంది పిల్లలకు వీటిని కేటాయిస్తారు. ఒకవేళ సిబ్బంది పిల్లల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ సంఖ్యను ఐదుకు పెంచనున్నారు. కనీ్వనర్ కోటా సీట్లను రెండు కౌన్సెలింగ్‌ల ద్వారా ఇప్పటికే భర్తీ చేశారు. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. ఇంకా పూర్తిస్థాయిలో విద్యార్థుల భర్తీ జరగనప్పటికీ ఏప్రిల్18 నుంచి తరగతులు ప్రారంభించారు.
చదవండి:
After Inter BiPC: అవకాశాలు భేష్!
Career in Nursing: ఏ కోర్సు చేసినా ఉజ్వల కెరీర్ ఖాయం... నెలకు రూ.44 వేల వరకు జీతం
Good News: నర్సింగ్ విద్యార్థులకు శుభవార్త