TGSRTC: డేటా సైన్స్ తో ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టం.. ప్రజల అవసరాలకు తగ్గట్లు రవాణా సేవలు
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా డేటా సైన్స్‌ను ఉపయోగించుకోనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. డేటా సైన్స్‌ను వినియోగించుకుని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కసరత్తు చేస్తామని చెప్పారు. కార్పొరేట్ సంస్థలకు అది జీవనాడిలాగా పనిచేస్తోందన్నారు.
ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంత సేవలందించేందుకు డేటా విశ్లేషణను వినియోగించుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ బస్ భవన్ లో లీడర్ షిప్ టాక్స్ లో భాగంగా గురువారం ‘ప్రజా రవాణా వ్యవస్థలో డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వినియోగం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో డేటా సైన్స్,మెషీన్ లెర్నింగ్ నిపుణుడు శరత్ కాటిపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
డేటా సైన్స్‌ను ఉపయోగించుకుని ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా పటిష్టం చెయొచ్చని అన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలను అందించడంతో పాటు టీజీఎస్ఆర్టీసీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డేటా విశ్లేషణ దివ్య ఔషధంలాగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.ప్రతి రోజు సగటున 55 లక్షల మందిని తమ బస్సుల్లో టీజీఎస్ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చడం గొప్ప విషయమని అన్నారు. వారి ప్రయాణ డేటాకు అనుగుణంగా రియల్ టైంలో మెరుగైన రవాణా సేవలను అందించవచ్చని చెప్పారు.
TS DSC Hall Ticket 2024: డీఎస్సీ హాల్‌టికెట్స్ విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే
మెసేజ్, మెసేంజర్, మెకానిక్స్, మెషినరీ అనే 4ఎం కాన్సెప్ట్ తో సంస్థను ఉన్నతస్థాయికి ఎలా తీసుకువెళ్లోచ్చో వివరించారు. సాంకేతికతలో వస్తోన్న మార్పులను అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు సంతృప్తికర సేవలను అందించే తీరును తన అనుభవంతో ఉదాహరించారు. అనంతరం ఆర్టీసీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
తెలంగాణకు చెందిన శరత్ కాటిపల్లి.. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీని అమెరికాలో చేశారు. అలాగే, ప్రముఖ స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సును అభ్యసించారు. అనంతరం మల్టీ నేషనల్ సంస్థలైన లెక్స్ మార్క్, జీఏపీ ఐఎన్సీ, ఐబీఎం గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్, హెచ్ఎస్బీసీ, అమెజాన్ లాంటి సంస్థల్లో డేటా సైంటిస్ట్ గా విధులు నిర్వర్తించారు. జేపీ మోర్గాన్ కార్పొరేట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థకు చీఫ్ డేటా ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సంస్థ లూషియా ఏఐకి అడ్వైజర్ గా కొనసాగుతున్నారు.
Gujarat Job Interview Video Viral: నిరుద్యోగానికి నిదర్శనం!..5 పోస్టులు.. 1000 మంది పోటీ
ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, సీపీఎం ఉషారాణి, సీఎంఈ వెంకన్న, తదితరులతో పాటు వర్చ్ వల్ గా ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags
- TSRTC
- TGRTC
- Telangana State Road Transport Corporation
- public transport system
- data science
- data science and AI
- Machine Learning
- Data Scientist
- Sajjanar
- tsrtc md sajjanar
- Data Science and Analytics
- Telangana RTC news
- Data science in public transport
- RTC MD Sajjanar statement
- Transport system enhancement
- Corporate lifeline
- Data-driven transport solutions
- Public transport data analytics
- Telangana transport updates
- sakshieducation latest news