DEO Somasekhara Sharma: హెచ్‌ఎంలకు శిక్షణ
జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, మోడల్, రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీల హెచ్‌ఎంలు, ప్రత్యేకాధికారులకు ప్రభుత్వ డైట్ కళాశాలలో ఆగస్టు 21న నుంచి రెండు విడతల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కేటాయించిన తేదీల్లో ఆయా హెచ్‌ఎంలు హాజరు కావాలని డీఈఓ సోమశేఖర శర్మ తెలిపారు. శిక్షణ కాలంలో ఇతర అవసరాల కోసం సెలవులు మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
చదవండి: Teachers Leave Procedure: డుమ్మా టీచర్లపై నజర్! టీచర్ల సెలవుల అనుమతి ఎలా..?
డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ కోర్స్ డైరెక్టర్‌గా, డీసీఈబీ సెక్రటరి నారాయణ అసిస్టెంట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని, హైదరాబాద్‌లో ఇప్పటికే శిక్షణ పొందిన ఐదుగురు గెజిటెడ్ హెచ్‌ఎంలు రిసోర్స్ పర్సన్లుగా ఉంటారని వివరించారు. 21 నుంచి 23 వరకు మొదటి విడతలో ఖమ్మం డివిజన్‌లోని ఖమ్మం అర్బన్, రూరల్, కామేపల్లి, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, రఘునాథపాలెం, సింగరేణి, తిరుమలాయపాలెం మండలాల ప్రధానోపాధ్యాయులు, 24 నుంచి 28 వరకు రెండో విడతలో మధిర డివిజన్ పరిధిలోని మధిర, బోనకల్, చింతకాని, ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, వైరా, ఎర్రుపాలెం మండలాల హెచ్‌ఎంలు హాజరు కావాల్సి ఉంటుందని వివరించారు.
చదవండి: Teacher Adjustment: ఉపాధ్యాయ సర్దుబాటులో మినహాయింపులు