Skip to main content

Telugu University: ప్రతిభా పురస్కారాలు ప్రదానం.. పురస్కార గ్రహీతలు వీరే...

నాంపల్లి: వివిధ రంగాల్లో నిష్ణాతులైన 12 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలను అందజేశారు.
Telugu University
ప్రతిభా పురస్కారాలు ప్రదానం.. పురస్కార గ్రహీతలు వీరే...

 ఆగ‌స్టు 30న‌ ఎన్టీఆర్‌ కళా మందిరంలో జరిగిన 2021 పురస్కారాల ప్రదానోత్సవ సభలో జ్ఞాపిక, నగదు, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ సమాజంలో విస్మరణకు గురైన మహనీయులను వెలికితీసి ప్రతి ఏడాది తెలుగు విశ్వవిద్యాలయం వివిధ పురస్కారాల పేరిట సముచితరీతిన సత్కరిస్తోందన్నారు.

ముఖ్యఅతిధిగా హాజరైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య కొలకలూరి ఇనాక్‌ మాట్లాడుతూ.. వివిధ రంగాలలోని వ్యక్తుల శక్తి సామర్థ్యాలను వెలికితీసి వారి సమర్ధతను గుర్తించి గౌరవించడం తెలుగు వర్సిటీ ఔన్నత్యానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ స్వాగతోపన్యాసం చేశారు. సభా ప్రారంభంలో వెడ్మ శంకర్‌చే గోండీ భాషలో పాండవుల కథను ప్రదర్శించారు. 

చదవండి: Success Story: 23 ఏళ్ల‌కే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన శ్రీకాకుళం కుర్రాడు... వంశీకృష్ణ స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

పురస్కార గ్రహీతలు వీరే...  

గింజల నర్సింహారెడ్డి–కవిత, తేరాల సత్యనారాయణ శర్మ–పరిశోధన, బి.నరహరి– చిత్రలేఖనం, డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి–శిల్పం, ఎస్‌.కుమార్‌–నృత్యం, పి.పూర్ణచందర్‌–సంగీతం, జి.వల్లీశ్వర్‌–పత్రికారంగం, దెంచనాల శ్రీనివాస్‌–నాటకరంగం, వెడ్మ శంకర్‌–జానపద కళా రంగం, డాక్టర్‌ ముదిగొండ అమరనాధ శర్మ–అవధానం, డాక్టర్‌ కొండపల్లి నీహరిణి–ఉత్తమ రచయిత్రి, డాక్టర్‌ జి.అమృతలత–కథ.  

చదవండి: APPSC Group 1 Ranker Mutyala Sowmya Interview : మొద‌టి ప్ర‌య‌త్నంలోనే గ్రూప్‌-1 ఉద్యోగం సాధించానిలా.. నేను చ‌దివిన పుస్త‌కాలు ఇవే..

Published date : 31 Aug 2023 12:56PM

Photo Stories