APPSC Group 1 Ranker Mutyala Sowmya Interview : మొదటి ప్రయత్నంలోనే గ్రూప్-1 ఉద్యోగం సాధించానిలా.. నేను చదివిన పుస్తకాలు ఇవే..
![APPSC Group 1 Ranker Mutyala Sowmya Success Story in Telugu ,State Taxes Commissioner, Success in APPSC Group-1](/sites/default/files/images/2023/08/31/photo-1693457608.jpg)
జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల, కసి ఉంటే చాలు.. ఏదైనా సాధించొచ్చు.. అని నిరూపించారు.. ముత్యాల సౌమ్య. ఈ నేపథ్యంలో ముత్యాల సౌమ్యతో సాక్షిఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..
1. మీ కుటుంబం నేపథ్యం ఏమిటి..?
![appsc group 1 ranker Mutyala Sowmya family](/sites/default/files/inline-images/appsc%20group%201%20ranker.jpg)
నా పేరు సౌమ్య. మా సొంత ఊరు కొమెరపూడి గ్రామం, సత్తేనపల్లి మండలం, పల్నాడు జిల్లా. మా నాన్న రమేష్. మా నాన్న UTIITSLలో Branch Managerగా పని చేస్తున్నాడు. అలాగే మా అమ్మ కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్‌లో ఖమ్మం జిల్లాలో Women and Child Welfare Departmentలో పనిచేస్తున్నారు. మా తమ్ముడు అభినవ్.. ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తున్నాడు.
2. మీరు గ్రూప్-1 వైపు రావడానికి కారణం.. ప్రేరణ ఎవరు..?
నాకు సివిల్స్, గ్రూప్ గురించి Btech ముందు వరకు అంతగా అవగాహన లేదు. దాని తర్వాత మొత్తం మా నాన్న వల్లనే ఇటువైపు వచ్చాను.
3. మీ విద్యార్హతలు ఏమిటి.?
నేను బీటెక్‌ను ఐఐటీ బాంబే (IIT Bombay) నుంచి Computer Science and Engineering ను పూర్తి చేశాను.
4. మీ గ్రూప్-1 ప్రిపరేషన్‌లో ఎలాంటి వ్యూహాలను అనుసరించారు..?
నేను గ్రూప్-1 ప్రిపరేషన్‌కి ప్రత్యేకంగా ఏమి చేయలేదు. యూపీఎస్సీ సివిల్స్‌కి ప్రిపేర్ అవుతునే.. ఈ గ్రూప్-1 పరీక్షలను రాశాను. కాని తక్కువ Sources పెట్టుకొని.. చదివాను. చదివిన దానిని ఎక్కవ సార్లు రీవిజన్ చేయడంతో.. ఇది నాకు బాగా ఉపయోగపడింది.
5. కోచింగ్ లేకుండా గ్రూప్-1 సాధించ వచ్చా..? లేదా..?
కోచింగ్ లేకుండా గ్రూప్-1 ఖచ్చితంగా సాధించవచ్చును. పరీక్ష మీద అవగాహన కోసం కోచింగ్ ఉపయోగపడొచ్చు. కానీ అవగహన ఉంటే.. ఇంటర్నెట్ వాడుకొని కూడా విజయం సాధించవచ్చును. అలాగే మార్కెట్‌లోని ప్రమాణిక స్టడీ మెటీరియల్స్‌ని వాడుకొని.., సిలబస్ (Syllabus) ప్రకారం మనమే నోట్ రాసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు.
6. మీరు గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపిక అయ్యారు అని తెలియగానే ఎలా ఫీలయ్యారు..?
నేను గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికయ్యాని తెలియగానే.. చాలా ఆనందంగా అనిపించింది. అలాగే నేను పడ్డ కష్టానికి మంచి ఫలితం దక్కిందనిపించింది.
7. మీరు గ్రూప్-1 ఉద్యోగం కొట్టకుంటే.. తర్వాత మీ ఆప్షన్ ఏమిటి..?
యూపీఎస్సీ సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి.. అదే ఇంకొక్కసారి ప్రయత్నించేదాన్ని.
8. మీరు ప్రిలిమ్స్, మెయిన్స్‌కి ఎలా ప్రిపేరయ్యారు. వీటి ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది..?
ముందుగా చెప్పినట్లు నేను యూపీఎస్సీ సివిల్స్‌కి ప్రిపరేషన్ చేస్తూనే.. ఈ పరీక్ష రాశాను. ఇప్పుడు ఏపీపీఎస్సీ(APPSC) పేపర్స్ కూడా యూపీఎస్సీ(UPSC) మాదిరిగానే ఉండటంతో.. ఇది నాకు బాగా ఉపయోగపడింది.
9. మీ గ్రూప్-1 ఇంటర్య్వూ ఎలా సాగింది..? ఎలాంటి ప్రశ్నలు అడిగారు..?
నా గ్రూప్-1 ఇంటర్య్వూ చాలా మంచిగా జరిగింది. నాది బీటెక్‌లో Computer Science నేపథ్యమే కనుక.. దాని మీద ప్రశ్నలు అడిగారు. Artificial Intelligence iot Governanceలో ఎలా ఉపయోగపడతాయన్నారు..? అలాగే జనరల్‌గా corruption మీద, మహిళల సమస్యలపై మీద ప్రశ్నలు అడిగారు
10. గ్రూప్-1 లో విజయం సాధించాలంటే.. ఎలా ప్రణాళిక అవసరం..?
గ్రూప్స్ లాంటి పరీక్షల్లో విజయం సాధించాలంటే.. క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ ఎంతో ముఖ్యం. ఎక్కువ సేపు చదవటం కంటే.. రోజులో కొన్ని గంటలైన Consistentగా చదవాలి. చదివినదాన్ని రివిజన్ చేసుకోడం ఎంతో ముఖ్యం. అలాగే Previous Question Papers ఒక్కసారి చూసుకోవాలి. అలాగే డైలీ టెస్టులు రాయడం కూడా చాలా ముఖ్యం.
11. మీ హాబీస్ ఏమిటి..?
నాకు Badminton ఆడటం చాలా ఇష్టం. అప్పుడప్పుడు బుక్స్ చదువుతాను. అలాగే కూడా Calligraphy చేస్తాను.
12. మీరు గ్రూప్-1 ప్రిపరేషన్‌కు ఏఏ బుక్స్ చదివారు..?
➤ Indian History : Ancient and Medieval ☛ Old NCERT Books
➤ Modern History : Spectrum
➤ Polity : Laxmikant
➤ Indian Economy : Vivek Singh
➤ AP Economy : Socio Economic Survey, Budget Document
➤ Indian Geography : NCERT Books
➤ AP Geography : AP Government Sebsites, Socio Economic Survey
➤ Science and Technology : Previous Years Questions, News Papers
➤ Current Affairs : Own Notes From Daily News Papers
13. మీరు ఎన్నో ప్రయత్నంలో గ్రూప్-1 ఉద్యోగం కొట్టారు..?
మొదటి ప్రయత్నంలోనే గ్రూప్-1 ఉద్యోగం సాధించాను.
14. మీ తుదిపరి లక్ష్యం ఏమిటి? అలాగే మీరు లక్ష్యం కోసం పనిచేస్తారు ?
ఇప్పుడు వచ్చిన ఉద్యోగంలో 100 శాతం Effort పెట్టడం నా ముందున్న లక్ష్యం. తుదిపరి లక్ష్యం అంటే.. సమాజానికి నా సేవలు ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి. ఆ దిశగా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను.
15. గ్రూప్స్, వివిధ పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే యువతకు మీరు ఇచ్చే సలహాలు- సూచలను ఏమిటి ?
![appsc group 1 ranker success story in telugu](/sites/default/files/inline-images/swommya%20home%20top%20story%20321.jpg)
గ్రూప్స్ లేదా యూపీఎస్సీ సివిల్స్‌తో పాటు ఇతర పోటీపరీక్షలకు ప్రిపేరవుతున్న వాళ్లు ముందుగా అసలు ఈ వైపు ఎందుకు వస్తున్నారో ఆలోచించుకోవాలి. ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత వెనకడుగు వేయద్దు. ఈ పోటీపరీక్షలకు ముఖ్యంగా క్రమశిక్షణతో కూడిన ప్రిపేరేషన్ ఎంతో ముఖ్యం. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రిపరేషన్ కొనసాగించాలి. నోటిఫికేషన్ విషయంలో అనవసర ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీరు కేవలం కష్టపడటం మీదే ధ్యాస పెడితే.. ఏ పోటీపరీక్షల్లోనైన విజయం మీ సొంతం అవుతుంది.
Tags
- PSC group 1 ranker success story
- APPSC Group 1 Ranker Mutyala Sowmya Family
- Mutyala Sowmya Education
- APPSC Group 1 Ranker
- APPSC Group 1 Ranker Mutyala Sowmya Success Story
- Competitive Exams Success Stories
- Success Stories
- Inspire
- motivational storyCivil Services Success Stories motivational story in telugu Success Story
- sakshi education success stori