దక్షిణాఫ్రికాలో పాఠ్యపుస్తకంగా ‘తెలుగుబడి బాలవాచకం’
ఆధునిక పద్ధతిలో శాస్త్రీయ విధానంలో సాంకేతికత జోడించి రూపకల్పన చేసిన బాలవాచకంలో తక్కువ రోజుల్లో తెలుగు భాష చదవడం, రాయడం నేర్చుకునేలా పాఠాలు రాశారన్నారు. సరళ పదాలు, గుణింత పదాలు, ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర, సంశ్లేషాక్షర పదాలతో వాక్యనిర్మాణాలు సులభతరంగా నేర్చుకునేలా పాఠాలు రూపొందించారని తెలిపారు.
అభ్యాసకులకు సంస్కృతి, సాంప్రదాయాలను అలవర్చడానికి తెలుగు ఆటలు, పండుగలు , తిథులు, వారాలు, నెలలు, రుతువులు, తెలుగు సంవత్సరాలు, ఒంట్లు, నక్షత్రాలు రాశుల వివరాలను చేర్చారన్నారు. తెలుగుభాషోపాధ్యాయులకు ఈ పుస్తకం కరదీపికలా ఒక పరమార్శ గ్రంథంగా ఉపయోగపడనుందని వివరించారు.
ఈ సందర్భంగా కూకట్ల తిరుపతి మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో పాఠ్యపుస్తకంగా ఎంపికయ్యేందుకు సహకరించిన తెలుగు సాహిత్య వేదిక అధ్యక్షుడు రాపోలు సీతారామరాజు, ప్రముఖ సాహిత్య విమర్శకుడు సాగర్ల సత్తయ్య, ప్రోత్సాహం అందిస్తున్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నలిమెల భాస్కర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
కూకట్ల తిరుపతిని ఎలిగేడు ఎంపీపీ తానిపర్తి స్రవంతి, ఎంఈవో కవిత, పాఠశాల హెచ్‌ఎం నరేంద్రచారి, స్కూల్‌కాంప్లెక్స్ హెచ్‌ఎం గండ్ర దేవేందర్‌రావు, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం సంతోష్‌రెడ్డి, సుల్తాన్‌పూర్ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్‌రావు, ఉపాధ్యాయ సంఘం నాయకులు అభినందించారు.