Skip to main content

Telangana rains: జూలై 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

Telangana school holidays 2022 extended
Telangana school holidays 2022 extended

  రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు మరో 3 రోజులు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వు లు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పేర్కొన్నారు. భారీ వర్షాలుండటంతో 3రోజులు సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం జూలై 10న ప్రకటించింది. జూలై 14 నుంచి విద్యాసంస్థలు తెరవాల్సి ఉంది. కానీ మరో 3 రోజులు వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో పరిస్థితిని సమీక్షించిన అధికారులు 14 నుంచి 16 వరకూ సెలవులు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. 17వ తేదీ ఆదివారం సెలవు కావడంతో విద్యా సంస్థలు 18న పునఃప్రారంభం కానున్నాయి. 

Also read: Top 10 Facts About World Population

Published date : 14 Jul 2022 03:05PM

Photo Stories