Kakatiya University: అధ్యాపకుల పెన్షన్ నిలిపివేత!
Sakshi Education
కేయూ క్యాంపస్: తన పెన్షన్ ఎందుకు విడుదల చేయలేదని ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ మూడురోజుల క్రితం కాకతీయ యూనివర్సిటీ ఫైనాన్స్ ఆఫీసర్ తోట రాజయ్యతో వాగ్వాదానికి దిగి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
మనస్తాపం చెందిన రాజయ్య వర్సిటీ పరిధి రిటైర్డ్ అధ్యాపకుల సర్వీస్ పెన్షన్ విడుదల చేయకుండా నిలిపివేసినట్లు తెలిసింది. ఈ విషయం యూనివర్సిటీ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. వర్సిటీ పరిధిలో 242 మంది రిటైర్డ్ అధ్యాపక సర్వీస్ పెన్షనర్లు ఉన్నారు.
చదవండి: Kakatiya University: మహిళా ప్రొఫెసర్లపై వివక్ష
కేయూ పరిధి వివిధ వర్సిటీ కళాశాలలు, విభాగాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు వేతనాలు ఇప్పటికే విడుదలయ్యాయి. అలాగే నాన్ టీచింగ్ పెన్షనర్లకు, టీచింగ్ ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా పెన్షన్(డబ్బులు) విడుదల చేసిన రాజయ్య.. అధ్యాపక సర్వీస్ పెన్షనర్లకు ఇంకా విడుదల చేయలేదు.
Published date : 09 Oct 2023 01:48PM