Skip to main content

EWS రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు!

విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం తీసుకువచ్చిన 10% EWS రిజర్వేషన్లపై న‌వంబ‌ర్ 7న‌ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనున్నది.
EWS రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు!
EWS రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు!

ప్రస్తుతం రిజర్వేషన్ ఉన్న వర్గాలకు కాకుండా ఇతర వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి లబ్ధి చేకూరేందుకు Economically Weaker Section (EWS) పేరుతో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. అయితే, రిజర్వేషన్లు భారత రాజ్యాంగ మౌలిక సూత్రానికి వ్యతిరేకమంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో కేంద్రం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలవగా గత నెలలో వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

చదవండి: Jobs: ఈ సంస్థలో 95% పోస్టులు స్థానికులకే

10% EWS రిజర్వేషన్ల చెల్లుబాటుపై న‌వంబ‌ర్ 7న‌ ఉదయం 10.30 గంటలకు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వనున్నది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌ ధర్మాసనంతో పాటు సీజేఐ యూయూ లలిత్‌, జస్టిస్‌ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనాలు వేర్వేరు తీర్పులను వెలువరించనున్నాయి. 
చదవండి: WhatsApp: ఒకేసారి 32 మందితో వీడియో కాలింగ్‌.. 2 జీబీ వరకూ ఫైల్స్‌ ట్రాన్స్‌ఫర్‌...

Published date : 07 Nov 2022 04:25PM

Photo Stories