Skip to main content

WhatsApp: ఒకేసారి 32 మందితో వీడియో కాలింగ్‌.. 2 జీబీ వరకూ ఫైల్స్‌ ట్రాన్స్‌ఫర్‌...

5,000 మందికి మెసేజీల బ్రాడ్‌కాస్టింగ్‌, సర్వీసులు అప్‌డేట్‌ చేసిన వాట్సాప్‌
Services Updated WhatsApp
Whatsapp New Features

న్యూఢిల్లీ: ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ తాజాగా తమ సేవలను అప్‌డేట్‌ చేసింది. ఒకేసారి ఏకంగా 32 మందితో వీడియో, వాయిస్‌ కాలింగ్‌ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. అలాగే 2 జీబీ వరకూ ఫైల్స్‌ను (ఇప్పటి వరకూ 16 ఎంబీ) ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడంతో పాటు ఒక గ్రూప్‌లో 1,024 మంది దాకా జోడించుకునేలా పరిమితిని పెంచింది.

Also read: Digital Rupee: ఈ–రూపాయిపై పరీక్షలు మొదలు

5,000 మంది యూజర్ల వరకూ తమ కమ్యూనిటీల్లోని వారికి, పోల్స్‌లో పాల్గొనే వారికి మెసేజీలను బ్రాడ్‌కాస్ట్‌ చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ‘వాట్సాప్‌లో ’కమ్యూనిటీస్‌’ను నేడు ప్రవేశపెడుతున్నాం. ఇందులో సబ్‌ గ్రూప్‌లు, అనౌన్స్‌మెంట్‌ చానెల్స్‌ మొదలైన వాటితో గ్రూప్‌లను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవచ్చు. అలాగే పోల్స్, 32 మందితో వీడియో కాలింగ్‌ కూడా అందుబాటులోకి తెస్తున్నాం. ఎన్‌క్రిప్షన్‌ ద్వారా మీ మెసేజీలన్నీ గోప్యంగా ఉండేలా అన్ని చర్యలూ తీసుకున్నాం‘ అని వాట్సాప్‌ మాతృ సంస్థ మెటా వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ గురువారం ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 04 Nov 2022 11:57AM

Photo Stories