Jobs: ఈ సంస్థలో 95% పోస్టులు స్థానికులకే
జోనల్, మల్టీజోనల్ పద్ధతిలో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ‘95 శాతం స్థానికత’ను పరిగణనలోకి తీసుకొనేలా శాసనసభ ఇటీవల ఆమోదించడంతో దాన్ని ఆర్టీసీలో అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ పాలకమండలి నవంబర్ 4న ప్రత్యేకంగా సమావేశమైంది. స్థానికులకే పోస్టుల ప్రక్రియ అమలు విధివిధానాలకు సంబంధించి కొన్ని అంశాలను ప్రతిపాదించింది.
చదవండి: Electric Double Deckers: భాగ్యనగరానికి 10 విద్యుత్ డబుల్ డెక్కర్‌లు
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 రెవెన్యూ జిల్లాలు ఉండగా ఆర్టీసీలో మాత్రం 11 రీజియన్లే ఉన్నాయి. అలాంటప్పుడు స్థానికతను ఏ రకంగా పరిగణనలోకి తీసుకోవాలనే విషయమై పాలకమండలి సభ్యులు చర్చించారు. ఓ ప్రతిపాదనను ఖరారు చేసి ప్రభు త్వానికి ప్రతిపాదించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఆమోదించాక కొత్త రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నారు. ప్రస్తుతానికి డిపో మేనేజర్ కంటే దిగువ అధికార పోస్టుల్లో ఖాళీలు ఉండగా త్వరలో డ్రైవర్, కండక్టర్ పోస్టుల్లో కూడా ఖాళీలు ఏర్పడనున్నాయి.
చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: బస్‌పాస్‌లో 20 శాతం రాయితీ..