Justice Sujay Pal: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్‌పాల్
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను అనుసరించి, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నియామకాన్ని ఆమోదించారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ అలోక్‌అరాధే బాంబే హైకోర్టు చీఫ్‌గా బదిలీ అయ్యారు.
హైకోర్టులో 2వ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజోయ్‌పాల్‌కు సీజే బాధ్యతలను అప్పగించారు. రాజ్యాంగంలోని అధికరణ 223 ప్రకారం, జస్టిస్ సుజోయ్‌పాల్ ఈ బాధ్యతను స్వీకరించారు. ఆయనకు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడేవరకు సీజేగా కొనసాగుతారు.
మధ్యప్రదేశ్‌లో జన్మించి.. తెలంగాణకు..
జస్టిస్ సుజోయ్‌పాల్ 1964, జూన్ 21వ తేదీ మధ్యప్రదేశ్‌లో జన్మించారు. బీకాం, ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ చేసుకున్నారు. సివిల్, రాజ్యాంగ, పారిశ్రామిక, సర్వీస్‌తోపాటు పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, బోర్డులకు న్యాయవాదిగా పనిచేశారు.
Revenue Secretary: రెవెన్యూ కార్యదర్శిగా తుహిన్ కాంత పాండే
2011, మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014, ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ సుజోయ్‌పాల్ కుమారుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో అక్కడి హైకోర్టు నుంచి బదిలీ చేయాలని ఆయన కోరుకోగా, రాష్ట్రపతి ఆమోదించారు. 2024, మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
దాదాపు 10 నెలలుగా ఇక్కడ పనిచేస్తున్న ఆయన మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనల ఉల్లంఘన, గ్రూప్–1, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా పలు కీలక కేసులపై విచారణ చేపట్టారు. పలు కేసుల్లో తీర్పులు కూడా వెలువరించారు. కాగా, జస్టిస్ అలోక్‌అరాధే బదిలీతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 26కు చేరుకోనుంది.
Justice Srikrishna: ఫైనాన్స్ కంపెనీ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా జస్టిస్ శ్రీకృష్ణ