Tenth Class exams 2024 :పదో తరగతి లో నూరు శాతం మార్కులకు కృషి
Sakshi Education
Tenth Class exams 2024 :పదో తరగతి లో నూరు శాతం మార్కులకు కృషి
గౌరిబిదనూరు: తాలూకాలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్)లో 625కు గాను 625 మార్కులు అంటే నూరుశాతం తెచ్చుకొనేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారి శ్రీనివాసమూర్తి తెలిపారు. సోమవారం మాట్లాడుతూ అనేకమంది విద్యార్థులు 500కు పైబడి మార్కులు తెచ్చుకొంటూ ఉన్నారని, అటువంటి ఎంపిక చేసి టాపర్స్ అయ్యేలా శని, ఆదివారాలలో ఉత్తమ ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తామన్నారు. తాలూకాలోని 23 ప్రభుత్వ హైస్కూల్‌లలో ఉన్న ప్రతిభావంత విద్యార్థులకు ప్రత్యేక బోధన ద్వారా టెన్త్‌లో 625కు గాను 625 మార్కులు తెప్పించడం విద్యాశాఖ ప్రయత్న మని తెలిపారు ఈ కార్యక్రమానికి టార్గెట్– 625 అనే పేరు పెట్టినట్లు చెప్పారు
Also Read : Tenth and Inter Public Exams Best Tips 2024
Published date : 30 Jan 2024 03:18PM