Academic Exams: ఆగస్టు 1 నుంచి ఇంటర్, టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి, ఇంటరీ్మ డియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి మొదలవుతాయి.
ఆగస్టు 10వ తేదీ వరకూ ఇవి కొనసాగుతాయి. ఇంటర్ అడ్వాన్స్‌డ్ కోసం 3,48,171 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 1,34,329 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,13,267 మంది ఉన్నారు. పదో తరగతి సప్లిమెంటరీకి 55,662 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్, పదో తరగతి బోర్డ్ అధికారులు తెలిపారు.
Published date : 01 Aug 2022 06:51PM