PVSN Murthy: జాతీయ విద్య, సాంస్కృతిక ఉత్సవాల్లో శ్రీకాకుళం టీచర్
Sakshi Education
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ విద్యా, సాంస్కృతిక ఉత్సవాల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకే ఒక్క ఉపాధ్యాయుడు పీవీఎస్‌ఎన్ మూర్తి పాల్గొని అభినందన పత్రాన్ని అందుకున్నారు.
నవంబర్ 17 నుంచి 19 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నైనిటాల్‌లోని నేషనల్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ టీచర్స్ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా నైరా ప్రైమ రీ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పీవీఎస్‌ఎన్ మూర్తి పాల్గొన్నారు.
చదవండి: Ramchander: విద్యార్థుల్లో ఆంగ్లభాషా నైపుణ్యం పెంచాలి
23 రాష్ట్రాల నుంచి సుమారు 400 మంది ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు పాల్గొనగా.. ఇందులో జిల్లా నుంచి ఈ యన ఒక్కరికే అవకాశం లభించడం విశేషం. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భగత్ సింగ్ కోషి యారీ చేతుల మీదుగా అభినందన పత్రాన్ని అందుకున్నారు.
Published date : 21 Nov 2023 01:18PM