Ramchander: విద్యార్థుల్లో ఆంగ్లభాషా నైపుణ్యం పెంచాలి
రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ సహకారంతో విల్ టు కెన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యాయులకు కొనసాగుతున్న 40 రోజుల ఉచిత ఆన్‌లైన్ శిక్షణ తరగతుల్లో భాగంగా నవంబర్ 19న నల్లగొండలోని టీటీ డీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఒకరోజు ఫిజికల్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
చదవండి: English: విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడాలి
విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడేలా చేయాలనే లక్ష్యంతో నే ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ శిక్షణ ద్వారా మెళకువలు నేర్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 600 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారని తెలిపారు. ప్రతి విద్యార్థి తెలు గు మాట్లాడినట్టుగా ఇంగ్లిష్ మాట్లాడేలా చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం విల్ టు కెన్ సంస్థ డైరెక్టర్ రామేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ ఇప్పటివరకు తెలంగాణలో 20 జిల్లాల ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో రామచంద్రయ్య, ఉపాధ్యాయులు శ్రీని వాసాచారి, సైదులు పాల్గొన్నారు.
Tags
- English language skills
- Students
- Ramchander
- Will 2 Can Institute of English
- Free Online Training Classes
- Telangana
- NalgondaEducation
- LanguageSkills
- GovernmentSchools
- Ramachander
- AcademicMonitoring
- EnglishSpeaking
- StudentDevelopment
- EducationalSkills
- LanguageProficiency
- SkillBuilding
- Sakshi Education Latest News