English: విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడాలి
నవంబర్ 5న జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట ఎస్‌ఎస్‌ఎన్ గార్డెన్స్‌లో రాష్ట్ర పరిశోధన విద్యాసంస్థ సహకారంతో రామేశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు 40 రోజులు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ తరగతుల్లో భాగంగా ఫిజికల్ క్లాస్‌లను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సర్కారు బడులకు వచ్చే పేద విద్యార్థుల ఉన్నతితో పాటు ఇంగ్లిష్‌లో మాట్లాడే విధంగా చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమన్నారు. మనమంతా కృషి చేయాలన్నారు. వారిని ఆంగ్లంలో ప్రావీణ్యులను చేయాలన్నారు.
చదవండి: Free training in Spoken English: Spoken Englishలో ఉచిత శిక్షణ
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 జిల్లాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్లపై మరింత పట్టు సాధించేలా ఆన్‌లైన్ తరగతులను పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ మిగలిన ఐదు జిల్లాల్లో కూడా తరగతులను ప్రారంభించ బోతున్నామన్నారు. జిల్లా కేంద్రంలో 40 రోజుల ఆన్‌లైన్ శిక్షణ తరగతులను పురస్కరించుకుని మొదటిరోజు ఫిజికల్ తరగతులకు 3 వందల మంది టీచర్లు హాజరు కావడం సంతోషమన్నారు.
ఎస్‌ఈఆర్టీ సహకారంతో తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా ఆన్‌లైన్, ఫిజికల్ తరగతులను త్వరలోనే పూ ర్తి చేయడం జరుగుతుందన్నారు. కాగా ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్, డీఈఓ, ఏఎంఓ, ఎంఈఓలకు రామేశ్వర్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ, నోడల్ అధికారులు, హెచ్‌ఎంలు భగవాన్, రాజేందర్, నామాల సత్యనారాయణ, సంపత్, హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.