Skip to main content

Free training in Spoken English: Spoken Englishలో ఉచిత శిక్షణ

Free training in Spoken English
Free training in Spoken English

టెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌ సహకారంతో నిర్మాణ్‌ సంస్థ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ మయూర్‌ పట్నాల తెలిపారు.

టైపింగ్‌ స్కిల్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్‌, కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌, హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌, టెక్నికల్‌ స్కిల్స్‌, బేసిక్‌ అకౌంటింగ్‌ స్కిల్స్‌ కోర్సుల్లో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 6వ తేదీలోగా 9502874304, 9908104113 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Published date : 06 Nov 2023 12:49PM

Photo Stories