Free Soft Skills Courses: ‘సాఫ్ట్ స్కిల్స్’లో మనమే మేటి
బీటెక్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు పలు కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ పూర్తి ఉచితంగా కోర్సులు అందిస్తోంది. గడిచిన రెండేళ్లలో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేఎన్‌టీయూ–ఏ) పరిధిలో ఏకంగా 40 వేల మంది విద్యార్థులు ఉచితంగా ‘మైక్రో సాఫ్ట్’ శిక్షణ తీసుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మైక్రోసాఫ్ట్ శిక్షణ తీసుకున్న విద్యార్థుల జాబితాలో జేఎన్‌టీయూ అనంతపురం చోటు దక్కించుకుంది.
చదవండి: Job Trends: స్కిల్ ఉంటేనే.. కొలువు!
దేశంలోనే తొలి ‘నైపుణ్య పెంపుదల’ ప్రాజెక్ట్
ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు జగన్ సర్కారు పలు కోర్సులను ప్రవేశపెట్టింది. దేశంలోనే నైపుణ్య పెంపుదల నిమిత్తం నిర్వహిస్తున్న తొలి ప్రాజెక్ట్ ‘మైక్రో సాఫ్ట్ అప్ స్కిల్లింగ్ ప్రాజెక్ట్’ కావడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ (ఎంసీపీ), మైక్రోసాఫ్ట్ టెక్నికల్ అసోసియేట్ (ఎంటీఏ) మైక్రోసాఫ్ట్ ఫండమెంటల్ విభాగాల్లో 40 రకాల కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకు ఎంపికై న విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ కోర్సులే కాకుండా ‘లింక్డిన్’ ప్లాట్‌ఫాంతో అనుసంధానం చేస్తున్నారు. దీని ద్వారా లింక్డిన్‌లోని టెక్నాలజీ, క్రియేటివిటీ, బిబిజెన్ విభాగాల్లో 8 వేలకు పైగా కోర్సులు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి.
శిక్షణ పొందే విద్యార్థికి మైక్రోసాఫ్ట్ సంస్థ వంద డాలర్ల విలువైన గిఫ్ట్ ఓచర్లను కూడా అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ అందించే కోర్సులతో పాటు ఇతర కోర్సులు, ల్యాబ్‌ల కోసం ఈ గిఫ్ట్ ఓచర్ క్రెడిట్‌ను విద్యార్థులు వినియోగించుకోవచ్చు. అజూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అజూర్ వర్చువల్ మెషీన్స్, అజూర్ ఎస్‌క్యూఎల్ డేటాబేస్, యాప్స్ బిల్డింగ్ వంటి కోర్సులకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణతో సంబంధం లేకుండా విద్యార్థులకు అవకాశం కలుగుతుంది.
చదవండి: Campus Placement: క్యాంపస్ డ్రైవ్స్.. ఆఫర్ దక్కేలా!
ఒక్కో విద్యార్థిపై రూ.50 వేల దాకా ఖర్చు
మైక్రోసాఫ్ట్ అజూర్ శిక్షణ కోసం ఒక్కో విద్యార్థికి రూ.25 వేల నుంచి రూ.50 వేల దాకా ఖర్చు అవుతుంది. రెండేళ్లలో మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా ఏకంగా 40 వేల మంది విద్యార్థులు జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో శిక్షణ తీసుకోవడం రికార్డుగా నిలిచింది.
విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ విధంగా ఏ ప్రభుత్వమూ ప్రయత్నాలు చేయలేదంటూ మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.