Department of Education: పరిశోధనలకు సింగపూర్ వర్సిటీ సహకారం
సింగపూర్‌లో ఉన్న అపార అవకాశాలతోపాటు భారతీయ విశ్వవిద్యాలయాలు, తెలంగాణ విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన అవకాశాలపై చర్చించేందుకు నాన్యాంగ్ వర్సిటీ ప్రతినిధులు మే 29న సచివాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశమయ్యారు. ఎన్‌టీయూ ప్రత్యేకతలు, వర్సిటీ ఆధ్వర్యంలో తాజాగా చేపట్టిన పరిశోధనాభివృద్ధి కార్యకలాపాలను వివరించారు.
చదవండి: IIT Indore: జ్వాలలను శోధించే మల్టీస్పెక్ట్రల్ కెమెరా
రాష్ట్రంలోని వర్సిటీలను బలోపేతం చేయడంతోపాటు ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఎన్‌టీయూ నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. మంత్రి సబిత మాట్లాడుతూ లైఫ్ సైన్సెస్, ఐటీ, బయోటెక్నాలజీ, ఫార్మా తదితర రంగాలకు హబ్‌గా అవతరించిన తెలంగాణ రాష్ట్రం... ఎడ్యుకేషన్, ఇంక్యుబేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పరిశోధన రంగాల్లో ముందంజలో ఉందని చెప్పారు. నాన్యాంగ్ వర్సిటీ ప్రతినిధి బృందం జూలైలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనుంది.