IIT Indore: జ్వాలలను శోధించే మల్టీస్పెక్ట్రల్ కెమెరా
అమెరికా, స్వీడన్ శాస్త్రవేత్తలతో కలిసి భారత పరిశోధకులు ఒక వినూత్న కెమెరాను అభివృద్ధి చేశారు. మంటల్లో నాలుగు రకాల రసాయనాల జాడకు సంబంధించిన మల్టీస్పెక్ట్రల్ చిత్రాలను ఇది అందిస్తుంది. డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా సాయంతో ఈ సాధనాన్ని అభివృద్ధి చేశారు. గతంలో ఇలాంటి అంశాల చిత్రీకరణకు నాలుగు కెమెరాలతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అవసరమయ్యేది. ఇండోర్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. ఇంధనాల ప్రజ్వలన గురించి శోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా కంబషన్ ఇంజన్లను మెరుగుపరుచొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతిమంగా దీని ద్వారా హానికర ఉద్గారాలను తగ్గించొచ్చని వివరించారు. ఇంధనాన్నీ పొదుపుగా వాడటానికి వీలు కల్పిస్తుందన్నారు. పారిశ్రామిక దహన యంత్రాలు, వాహనాలు, విమానాలు, వ్యోమనౌకల ఇంజిన్ల నుంచి వెలువడే మూలకాలపై పరిశోధనలు సాగించొచ్చని పేర్కొన్నారు. ఈ సాధనానికి ’సీఎల్–ఫ్లేమ్’ అని పేరు పెట్టారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP